



.jpeg/:/rs=w:370,cg:true,m)






అమెరికా అందాల పోటీల్లో పల్నాడు జిల్లా యువతికి రన్నరప్ గా గౌరవం
అమెరికాలో జరిగిన ‘తెలుగు యూఎస్ఏ’ అందాల పోటీల్లో పల్నాడు జిల్లాకు చెందిన దివ్యశ్రీ రన్నరప్‌గా నిలిచి ప్రతిభ కనబరిచారు.
చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన దివ్యశ్రీ ప్రస్తుతం అమెరికాలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
ఆరు నెలల పాటు జరిగిన ఈ పోటీల్లో అందం, వ్యక్తిత్వం, ప్రతిభ, తెలివితేటల్లో ఆమె మెరుగైన ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
దివ్యశ్రీ సాధించిన ఈ విజయంపై ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హర్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా దిగ్బంధనాన్ని ఛేదించిన ఇరాన్ నౌకలు!
హర్మూజ్ జలసంధిలో అమెరికా విధించిన దిగ్బంధనం
ఏఐఎస్ సిగ్నల్స్ మార్చి తప్పించుకున్న ఇరాన్ నౌకలు
10,000 మంది సైనికులతో యూఎస్ కట్టుదిట్టమైన చర్యలు
దిగ్బంధనం వద్దకు వస్తే నౌకలను ధ్వంసం చేస్తామన్న ట్రంప్
పది శాతం కంటే తక్కువ స్థాయికి పడిపోయిన నౌకల రద్దీ
ఇరాన్‌పై అమెరికా విధించిన కఠినమైన నౌకా దిగ్బంధనాన్ని ఛేదించుకుని ఇరాన్ నౌకలు చాకచక్యంగా ముందుకు సాగుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో అమెరికా సైనిక నిఘా కళ్లుగప్పి, తమ గమ్యస్థాన వివరాలను మార్చివేసి కనీసం రెండు నౌకలు విజయవంతంగా ఇరాన్ పోర్టుల వైపు ప్రయాణించాయి. ఈ పరిణామం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది.
జిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం ఈ విషయాన్ని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ షిప్పింగ్ మీడియా 'లాయిడ్స్ లిస్ట్' వెల్లడించింది. అమెరికా దిగ్బంధనం అమల్లోకి వచ్చాక, ఇరాన్‌కు చెందిన రెండు కంటైనర్ నౌకలు తమ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఐఎస్)లో గమ్యస్థానాన్ని మార్చేశాయి. తొలుత 'బందర్ అబ్బాస్' పోర్టుగా ఉన్న వివరాలను, మరింత సాధారణంగా ఉండే 'పీజీ పోర్ట్స్' (పర్షియన్ గల్ఫ్ పోర్టులు) అని మార్చడం ద్వారా అమెరికా దళాలను ఏమార్చాయి. జలసంధిని దాటిన తర్వాత, మంగళవారం అవి తిరిగి బందర్ అబ్బాస్ పోర్టు వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించాయి. ఇరాన్ అనుసరిస్తున్న ఈ ఎత్తుగడలు అమెరికా నిఘా వ్యవస్థకు సవాలుగా మారాయని, అనుమానిత నౌకలను గుర్తించేందుకు అదనపు వనరులు అవసరమవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఈ దిగ్బంధనాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. 10,000 మందికి పైగా సైనికులు, డజనుకు పైగా యుద్ధనౌకలు, డజన్ల కొద్దీ విమానాలతో ఇరాన్ పోర్టులను దిగ్బంధించినట్లు ప్రకటించింది. తొలి 24 గంటల్లో ఏ నౌక తమ వలయాన్ని దాటలేదని, ఆరు వాణిజ్య నౌకలను వెనక్కి పంపించామని 'ఎక్స్'లో పేర్కొంది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. "హెచ్చరిక: మా దిగ్బంధనం సమీపంలోకి ఏ ఇరాన్ నౌక వచ్చినా, సముద్రంలో డ్రగ్ డీలర్ల పడవలపై ప్రయోగించే వ్యవస్థతోనే వాటిని తక్షణమే ధ్వంసం చేస్తాం" అని తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో సంచలన పోస్ట్ చేశారు.
ఈ ఘర్షణ వాతావరణం కారణంగా హర్మూజ్ జలసంధిలో నౌకల రద్దీ గణనీయంగా పడిపోయింది. సంఘర్షణకు ముందు రోజు 100కి పైగా నౌకలు ప్రయాణించగా, ఇప్పుడు ఆ సంఖ్య 10 శాతం కంటే తక్కువ స్థాయికి చేరింది. ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్
సీనియర్లకు గౌరవం... కొత్తవారికి అవకాశాలు...సామాజిక కోణం కోణంలో నూతన కమిటీల కూర్పు
విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి పదవులు ఇచ్చిన అధిష్టానం
నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం
• పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు.... ప్రతి కమిటీలోను నూతనత్వం
• 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ కూర్పు.
• జాతీయ ప్రధాన కార్యదర్శులు-3, జాతీయ ఉపాధ్యక్షులు-18, జాతీయ అధికార ప్రతినిధులు-10
• రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు-7, రాష్ట్ర ఉపాధ్యక్షులు-16, రాష్ట్ర అధికార ప్రతినిధులు-14, రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్ల-10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు-59, రాష్ట్ర కార్యదర్శులు-77.
• నాలెడ్జి కమిటీ, హెచ్ఆర్డీ కమిటీల్లో ఒక్కొరి చొప్పున నియామకం.
• అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పుపై కసరత్తు చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు.
• గతానికి భిన్నంగా పార్టీ కమిటీల కూర్పును కొత్త పుంతలు తొక్కించిన ముఖ్యమంత్రి
• గత కొంత కాలంగా చెబుతున్నట్టే పార్టీ బలోపేతానికి కష్టపడిన వారికి, విధేయులకు పెద్ద పీట.
• ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, ఓ క్లస్టర్ ఇన్ఛార్జికి నేరుగా పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి
• పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్న గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్.
• రాష్ట్ర కమిటీలోని 185 మందికి గానూ... 50 మంది మహిళలకు చోటు, పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం.
• జనాభా దామాషా పద్దతిన, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పు.
• 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బడుగులకు స్థానం కల్పించిన టీడీపీ అధిష్టానం
• బీసీ-77, ఎస్సీ-25, ఎస్టీ-7, మైనార్టీ-13 మందికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించిన చంద్రబాబు.
• బీసీలకు 40 శాతం, ఎస్సీలకు 25 శాతం, ఎస్టీలకు 3.8 శాతం, మైనార్టీలకు 7 శాంత చొప్పున కమిటీలో స్థానం కల్పించిన టీడీపీ అధినాయకత్వం.
• 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల్లో విశ్లేషించి కమిటీల కూర్పు చేపట్టిన చంద్రబాబు
• పార్టీకి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చేలా నియామకాలు.
• నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, 33 శాతం మహిళా రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని కసరత్తు చేసిన చంద్రబాబు
• గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు పెద్ద పీట వేస్తూ కమిటీల కూర్పు.

Amarnath Yatra 2026: అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ షురూ.. వీరు మాత్రమే అర్హులు !
భారతదేశంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటైన అమర్‌నాథ్ యాత్ర 2026కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఈ ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగస్టు 28వ తేదీన ముగుస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 57 రోజుల పాటు యాత్ర సుదీర్ఘంగా సాగనుంది. మంచు శివలింగ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో సవాలుతో కూడిన ఈ యాత్రలో పాల్గొంటారు. భక్తులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 550కి పైగా బ్యాంక్ శాఖల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర బ్యాంకుల వద్ద ఈ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. అలాగే, శైన్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రతి భక్తుడికి ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరి. భక్తుల భద్రత కోసం ఆర్ఎఫ్‌ఐడీ ట్రాకింగ్ వ్యవస్థతో పాటుగా ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం
- ముందుగా శ్రీ అమర్‌నాథ్ జీ శ్రైన్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి లేదా సమీపంలోని ఎంపిక చేసిన బ్యాంక్ శాఖకు వెళ్లాలి.
- దరఖాస్తు ఫామ్ నింపి అందులో అడిగిన వ్యక్తిగత వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి.
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, సరైన గుర్తింపు కార్డు జత చేయాలి.
- ఏప్రిల్ 8వ తేదీ తర్వాత గుర్తింపు పొందిన వైద్యుల నుంచి తీసుకున్న కచ్చితమైన ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని (CHC) సమర్పించాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తుదారులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ నింపి, పత్రాలను అప్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
- ఆఫ్‌లైన్‌లో అయితే బ్యాంకులో నేరుగా ఫీజు చెల్లించి రశీదు పొందాలి.
- దరఖాస్తు విజయవంతమైన తర్వాత భక్తులకు సిస్టమ్ జనరేటెడ్ యాత్రా పర్మిట్ జారీ అవుతుంది. అందులో యాత్ర తేదీ, ఎంచుకున్న మార్గం తదితర వివరాలు ఉంటాయి.
అర్హతలు, వసతుల వివరాలు
అమర్‌నాథ్ యాత్ర చాలా ఎత్తులో కష్టతరమైన వాతావరణంలో సాగుతుంది కాబట్టి కఠినమైన ఆరోగ్య నిబంధనలు అమలు చేస్తున్నారు. 13 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు మాత్రమే ఈ యాత్రకు అర్హులు. ఆరు వారాలకు పైబడిన గర్భిణీ స్త్రీలకు అనుమతి లేదు. భక్తుల ప్రయాణం కోసం పహల్గామ్, బల్తాల్ అనే రెండు ప్రధాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఎంచుకున్న మార్గం ఆధారంగా రోజువారీ కోటా ప్రకారం ముందు వచ్చిన వారికి ముందు అనే పద్ధతిలో బుకింగ్స్ కేటాయిస్తారు.
ప్రయాణ తేదీకి ఏడు రోజుల ముందు ఆయా స్లాట్స్ మూసుకుపోతాయి కాబట్టి భక్తులు త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం మంచిది. ఈ ఏడాది బల్తాల్ మార్గంలో మెరుగైన విద్యుత్ దీపాలు, మంచి నడక మార్గాలతో పాటుగా గుర్రాలు, పల్లకీలు, పోర్టర్ల కోసం ముందస్తు బుకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. అనుకోని విపత్తులు ఎదురైతే కాపాడేందుకు ప్రత్యేక రెస్క్యూ బృందాలను కూడా సిద్ధం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కేసీఆర్
భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లులపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బుధవారం ఎర్రవెల్లి నివాసంలో పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయిన ఆయన.. జాతీయ రాజకీయాల్లో రాబోయే మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్రానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని కేసీఆర్ ప్రకటించారు. "మేము అధికారంలో ఉన్నప్పుడే అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ల కోసం తీర్మానం చేశాం. ఈ బిల్లుకు రాజ్యసభలో మా ఎంపీలు మద్దతు ఇస్తారు" అని ఆయన స్పష్టం చేశారు.
డీలిమిటేషన్‌పై 'దక్షిణాది' ఆందోళన
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఉంటే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24% ఎంపీ సీట్లు ఉన్నాయని, భవిష్యత్తులో సీట్లు పెంచినా ఈ శాతం తగ్గకుండా చూడాలని డిమాండ్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బిల్లులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని, అంతవరకు తొందరపడవద్దని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు.
పార్టీ కార్యక్రమాలపై చర్చ..
రాజకీయ అంశాలతో పాటు పార్టీ సంస్థాగత కార్యక్రమాలపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ, అలాగే ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కేటీఆర్, హరీష్ రావులను ఆదేశించారు.

ఏపీ కేబినెట్ ప్రక్షాళన – టైం వచ్చేస్తోంది!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై ప్రదర్శిస్తున్న కఠిన వైఖరి కేవలం పరిపాలనాపరమైన క్రమశిక్షణే కాకుండా, త్వరలో జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళన కు బలమైన సంకేతంగా కనిపిస్తోంది. ఇటీల కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు మీడియాకు చేరడంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎవరు లీక్ చేస్తున్నారో నాకు తెలుసు అని ఆయన అనడం వెనుక.. సదరు మంత్రులపై ఇప్పటికే నిఘా వర్గాల నుంచి ఆయనకు నివేదికలు అందాయని స్పష్టమవుతోంది. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం బడ్జెట్ వివరాల లీకేజీపై మొత్తం మంత్రివర్గాన్నే రద్దు చేసిన ఉదంతాన్ని గుర్తు చేయడం ద్వారా.. పనితీరు మార్చుకోని పక్షంలో ఉద్వాసన తప్పదనే హెచ్చరికను ఆయన బలంగా పంపారు.
రెండేళ్ల గడువు – పనితీరుకు గీటురాయి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్న తరుణంలో, ఇది మంత్రివర్గ మార్పులకు సరైన సమయంగా చంద్రబాబు భావిస్తున్నారు. మంత్రుల పనితీరుపై ఆయన వద్ద ఇప్పటికే 1, 2, 3 రేటింగ్స్ ఉన్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ప్రజల్లో పట్టు సాధించలేకపోయిన వారు, శాఖా పరమైన అంశాలపై అవగాహన లేని వారు , వివాదాల్లో చిక్కుకున్న మంత్రులను ఈసారి తప్పించి, వారి స్థానంలో కొత్త ముఖాలకు, యువతకు అవకాశం ఇవ్వాలని బాబు యోచిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల వ్యూహం
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు తన కొత్త టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీని ఉరకలెత్తించే చురుకైన నేతలకు, సామాజిక సమీకరణాల్లో ప్రాధాన్యత దక్కని వర్గాలకు ఈ ప్రక్షాళనలో పెద్దపీట వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఉన్న రాజకీయ అసమతుల్యతను సరిచేయడానికి కేబినెట్ విస్తరణ ఒక ఆయుధంగా మారనుంది.
లోకేష్, పవన్ ప్రభావం
ఈ విడత మార్పుల్లో నారా లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. యువ నేతలకు ప్రాధాన్యత పెంచే క్రమంలో కొందరు సీనియర్లను పార్టీ బాధ్యతలకు పరిమితం చేసే అవకాశం ఉంది. అలాగే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ కూటమిలోని ఇతర నేతలకు కూడా ప్రాతినిధ్యం పెంచడం ద్వారా 2029 ఎన్నికల వరకు బలమైన పునాది వేయాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. చంద్రబాబు ప్రస్తుతం డ్యామేజ్ కంట్రోల్ మోడ్‌లో ఉన్నారు. కేబినెట్ ఎజెండా లీక్ అవ్వడం అనేది ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే అంశంగా ఆయన భావిస్తున్నారు. అందుకే, శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి, ఎవరైతే అధికారులపై పట్టు సాధించలేకపోయారో వారిని నిర్మొహమాటంగా పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీ మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ
ఏపీలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రివర్గంలోని తొమ్మిది మంది మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ శిక్షణ జరగనుంది. సుపరిపాలన, ఆధునిక పరిపాలన పద్ధతులు, ఆర్థికాభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలపై మంత్రులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
ఈ ఉన్నత స్థాయి శిక్షణ కోసం మంత్రులు పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ, కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు సింగపూర్‌కు వెళ్లనున్నారు. తమ శాఖలకు సంబంధించిన ప్రపంచ స్థాయి విధానాలను అధ్యయనం చేసి, వాటిని ఏపీలో అమలు చేసే అవకాశాలను వీరు పరిశీలించనున్నారు. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్, పెట్టుబడుల ఆకర్షణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో సింగపూర్ అనుసరిస్తున్న విజయవంతమైన నమూనాలపై దృష్టి సారించనున్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థల్లో సింగపూర్ ఒకటిగా గుర్తింపు పొందింది. అవినీతిరహిత పాలన, పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ సేవల్లో విస్తృతంగా ఉపయోగించడం వంటి అంశాల్లో సింగపూర్ ఒక రోల్ మోడల్‌గా నిలుస్తోంది. ఈ కారణాలతోనే ఏపీ ప్రభుత్వం తమ మంత్రుల శిక్షణ కోసం సింగపూర్‌ను ఎంపిక చేసింది. ఈ శిక్షణ ద్వారా మంత్రులు నేర్చుకున్న అనుభవం, పరిజ్ఞానం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని, ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెరిగి ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు సుపరిపాలన దిశగా తీసుకున్న మరో ముఖ్యమైన ముందడుగుగా దీనిని విశ్లేషిస్తున్నారు.

ఏపీ—తెలంగాణను కలిపే గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభం
ఏపీ, తెలంగాణను కలుపుతూ 162 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభమైంది. ఈ మార్గంతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గనుంది. హైవేలో సీసీటీవీ కెమెరాలు, ఫాస్టాగ్ లైన్లు వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. అయితే ఖమ్మం వరకు పనులు పూర్తికాకపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వడం లేదు.

దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 7.2 కోట్ల అనర్హుల పేర్లను తొలగించారు. ఇందులో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఓటర్లు నివాసం మారడం, మరణించడం, డూప్లికేట్ పేర్లు వంటి కారణాలతో ఈ తొలగింపులు జరిగాయి. ఈ ప్రక్రియలో 2 కోట్ల మంది కొత్త ఓటర్లను కూడా చేర్చారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 45.8 కోట్లకు చేరింది. అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యధికంగా 16.6% ఓట్లు తొలగించబడ్డాయి.
Say something interesting about your business here.
What's something exciting your business offers? Say it here.
Give customers a reason to do business with you.

Welcome to HR Publications, HR News Express your go-to source for effective and affordable newspaper advertising services. To file your Interest and Resume below the attachment link.

HR Publications is dedicated to providing the latest human resources insights through our digital printing services, magazine creation, website building, and business management publications. Our goal is to empower professionals with the knowledge they need to succeed.
We love our customers and encourage you to visit during normal business hours to explore our latest business management publications and learn about our digital printing services, along with valuable human resources insights.
16/18 Upstairs , NTR Circle, Dharmavaram, Sri Sri SatSai dit, A.P.
Open today | 09:00 am – 06:15 pm |

Get 10% off your first purchase when you sign up for our newsletter!
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.